Wednesday, 4 November 2026

దీక్ష విరమించిన తెరాస ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌: వ్యవసాయానికి 7 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తామని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హమీ ఇవ్వడంతో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దీక్ష విరమించారు. ఈ సందర్బంగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్‌, హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమో, తెలంగాణ సమస్యలపై కూడా టీఆర్‌ఎస్‌ పోరాటం చేస్తుందని ఈటెల పెర్కొన్నారు. విద్యుత్‌ కోసం ఆందోళనలో పాల్గొన్న కార్యకర్తలకు ఎమ్మెల్యే హరీష్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం హమీ ఇచ్చినట్లు 7 గంటల విద్యుత్‌ సరఫరా అవుతుందో లేదో పరిశీలించాలని కార్యకర్తలకు ఆయన సూచించారు. 7 గంటల విద్యుత్‌ సరఫరా కాని పక్షంలో 040-30756666 నంబర్‌కు ఫోన్‌ చేయాలని హరీష్‌రావు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *