Wednesday, 4 November 2026

గ్రామీణ ప్రాంతాల్లో నకిలీనోట్ల చలామణి

నల్గొండ: నల్గొండ మండలం మునగాల పోలీస్‌స్టేషన్‌ సమీపంలో 65వ జాతయ రహదారిపై నకిలీనోట్లతో వెళుతున్న ఇద్దరిని అరెస్టు చేసి 2లక్షల 90 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు అడిషనల్‌ ఎస్పీ లక్ష్మికాంతారావు తెలిపారు. హైదరాబాద్‌లోని నాగోలుకు చెందిన వెంకట శ్యాంకుమార్‌ అలియాస్‌ పెదబాబు, భువనగిరి మండలం చందుపట్లకు చెందిన రాచమళ్ల అంజయ్యలు నకిలీనోట్లు తయారుచేసి గ్రామీణ ప్రాంతల్లో చలామణి చేస్తున్నారని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *