Thursday, 5 November 2026

దీపావళి కానుకగా” డీ ఏ “ప్రకటించాలి:-

మిర్యాలగూడ,జనం సాక్షి
             దీపావళి కానుకగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఉద్యోగ ఉపాధ్యాయులకు రావలసిన “డి ఏ “ప్రకటించాలని బంజారా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మాలోతు దశరధ నాయక్ కోరారు. ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ 2021 జులై, 2022 జనవరి, జూలై డి ఏ  లు రావాల్సి ఉన్నదని పండగ సందర్భంగా ఆయన ప్రకటించాలని కోరారు. ఉద్యోగులు ఉపాధ్యాయులు “డిఏ”లు కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు ఉద్యోగులు ఉపాధ్యాయులకు పదోన్నతుల షెడ్యూలు విడుదల చేయాలని సూచించారు. సంవత్సరాల తరబడి పదోన్నతి లేకపోవడంతో అనేక మంది ఉద్యోగ ఉపాధ్యాయులు నియామకమైన పోస్ట్ లోనే రిటైర్ అయ్యే పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
Attachments area