ఎల్బీ నగర్( జనం సాక్షి ) ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలకు లింగోజిగూడ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాస్ రావు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండుగ ప్రజల జీవితాల్లో మరిన్ని ప్రగతి కాంతులు నింపుతున్నదని మంత్రి పేర్కొన్నారు. చీకట్లను పారద్రోలి వెలుగులను నింపే పండుగగా ప్రజలు దీపావళి పండుగ జరుపుకుంటారని అన్నారు. దీపావళి పండుగ చెడుపై ధర్మానికి విజయమన్నారు. దీపావళి మన చుట్టూ ఉన్న ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకురావాలని, కొత్త ఆలోచనలను ప్రోత్సహిస్తుందని అన్నారు. అందరూ జాగ్రత్తగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా పండుగ జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల జీవితాల్లో దీపావళి పండుగ మరిన్ని ప్రగతి కాంతులు నింపాలని ముద్ర బొయిన శ్రీనివాసరావు ఆకాంక్షించారు.
దీపావళి శుభాకాంక్షలు తెలిపిన :లింగోజిగూడ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాస్ రావు




