Thursday, 5 November 2026

దుండ్రపల్లీ లో ఘనంగా కుంకుమ పూజలు

బోయిన్ పల్లి సెప్టెంబర్ 04 (జనంసాక్షి): సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలంలోని దుండ్రపల్లి గ్రామంలో లోని హనుమాన్ నగర్ లో ఏర్పాటు చేసిన యువజన సంఘం గణేష్ మండపం వద్ద ఆదివారం రోజున కుంకుమ పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పూజారి గణనాథునికి భక్తితో విశిష్టమైన పూజా కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం స్థానిక కాలనీ మహిళలతో కుంకుమ పూజను ఘనంగా జరిపించారు. పూజానంతరం గణనాథుని తీర్థప్రసాదాలు వితరణ చేశారు ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలతో పాటు డి డి పి యువజన సంఘం గణేష కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు