Wednesday, 4 November 2026

దుబ్బాక నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదిస్తే సేవ చేస్తా

-సమాజ్ వాది పార్వర్డ్ బ్లాక్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి పోసానిపల్లి మహిపాల్ రెడ్డి
దుబ్బాక,అక్టోబర్ 19(జనంసాక్షి)సమాజ్ వాది పార్వర్డ్ బ్లాక్  దుబ్బాక నియోజకవర్గ అభ్యర్థిగా పోసానిపల్లి (భంగ్ల)మహిపాల్ రెడ్డికి టికెట్టు ఖరారు చేసినట్లు ఆ పార్టి జాతీయ అధ్యక్షుడు ఎల్ . మురళిధర్ రావు దేశ్ పాండే వెల్లడించారు.రాష్ట్రంలో 50 స్థానాలలో సమాజ్ వాది పార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులను బారిలో నిలుపుతున్నామని చెప్పారు.దుబ్బాక నియోజక వర్గ అభ్యర్థిగా మహిపాల్ రెడ్డిని ప్రకటించమని తెలిపారు.ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి మాట్లడుతూ నియోజక వర్గంలోని అన్ని వర్గాల ప్రజలకు వెన్నంటు ఉంటు దుబ్బాక అభివృద్దికి తోడ్పాటు అందిస్తానని పేర్కోన్నారు. కళాశాల విద్యాబ్యాసం నుండే పలు సామాజీక సేవ కార్యక్రమాలు చేపట్టానని సూచించారు. దుబ్బాక నియోజకవర్గ ప్రజలు నన్ను ఆశ్వీరదించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా దుబ్బాకను అన్ని రంగాలలో అభివృద్ది పథంలో ముందుంచుతానని తెలిపారు.గతంలో అనేకమైన సేవ కార్యక్రమాలతో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాలు పర్యటించినట్లు పేర్కోన్నారు.