Wednesday, 4 November 2026

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన రిటర్నింగ్ అధికారి

భీమ్‌గల్‌, అక్టోబర్ 19 (జనంసాక్షి) : మండలకేంద్రంలోని పోలింగ్ కేంద్రాలను శుక్రవారం బాల్కొండ రిటర్నింగ్ అధికారి జడ్పీసీఇఓ వేణు ఆకస్మికంగా పరిశీలించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనతో పంచాయతి రాజ్ ఏఈ రాజేశ్వర్, ఆర్ఐ జ్యోత్స్న, ఎస్ ఎ రామారావు, గంగాధర్, సిబ్బంది పాల్గొన్నారు.