దుర్గామాత ఆలయాల్లో పుట్ట మధు ప్రత్యేక పూజలు

దుర్గామాత ఆలయాల్లో పుట్ట మధు ప్రత్యేక పూజలు

జనంసాక్షి ,మంథని, అక్టోబర్ 21:
దేవీశరన్నవరాత్రోత్సవాల్లో బాగంగా కమాన్‌పూర్‌ మండలంలో ఏర్పాటు చేసిన దుర్గామాతను బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మండలంలోని జూలపల్లి, కమాన్ పూర్,గుండారం,పేరపల్లి, రొంపికుంట,నాగారం లలో ప్రతిష్టించిన దుర్గామాతను ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా ఉత్సవ కమిటి సభ్యులు ఆయనకు ఘనస్వాగతం పలికి శాలువాతో సన్మానించారు.