దుర్గామాత దయతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి

జగిత్యాల సెప్టెంబర్ 29 (జనం సాక్షి)జగిత్యాల సెప్టెంబర్ 29 (జనం సాక్షి)
విద్యానగర్ దుర్గ గాయత్రి దేవాలయం లో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహం వద్ద ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుర్గామాత దయతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలన్నారు.జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి సంప్రదాయాలకు దుర్గా మాత ఉత్సవాలు ప్రతీకలు అన్నారు. బతుకమ్మ పండుగ మహిళల పండుగని ప్రభుత్వం మహిళలకు తో బుట్టువుగా ఉంటూ పండుగకు చీరలు కానుకలు పంపిణీ చేస్తోందన్నారు. పండుగలు చెడుపై మంచి సాధించిన విజయాలు అన్నారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన  కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ని, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దయాల శంకర్,ఇప్ప జగన్,రఘునందన్, శ్రీనివాస్, చంద్రారెడ్డి,అశోక్,అనిల్ కుమార్, రాజేశ్వర్ రెడ్డి, గంగారెడ్డి,గిరి నాగభూషణం, దేవేందర్ రెడ్డి, వేంకటేశ్వర్ రావు,  ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.