దూల్మిట్ట మండల జేఏసీ కన్వీనర్ గా సిరిమల్ల ఉపేందర్..

ధూల్మిట్ట (జనంసాక్షి) జులై 21 : రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకై సాగుతున్న ఉద్యమ విస్తరణలో భాగంగా దూలిమిట్ట మండల కన్వీనర్ గా సిరిమల్ల ఉపేందర్, కో కన్వీనర్ గా బాదావత్ శ్రీనివాస్ లను నియమిస్తున్నట్లు జేఏసీ చైర్మన్ బైరవపట్ల చక్రధర్, జేఏసీ కన్వీనర్ గద్దల మహేందర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ప్రాంత అభివృద్ధి కోసం,అస్తిత్వం కోసం ప్రజల ఆశలకు ఆశయాలకు అనుగుణంగా పోరాటం కొనసాగిస్తామని, అందులో భాగంగానే కన్వీనర్ల నియామకం జరుగుతుందని తెలిపారు. భవిష్యత్తులో మరింత నిర్మాణం చేపడతామని ఈ ప్రాంతం కోసం జరిగే ఉద్యమాలలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరుతున్నామన్నారు.