Monday, 2 November 2026

దేదీప్యలో నేషనల్ సైన్స్ డే సందర్భంగా విజ్ఞాన ప్రదర్శన

భువనగిరి టౌన్ (జనం సాక్షి):–స్థానిక దేదీప్య ఉన్నత పాఠశాలలో జాతీయ విజ్ఞాన దినోత్సవ సందర్భంగా విజ్ఞాన ప్రదర్శన నిర్వహించారు సుమారుగా 100 విజ్ఞాన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ ప్రదర్శనలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు విద్యార్థినీ విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని అలరించాయి. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మాట్లాడుతూ జాతీయ విజ్ఞాన దినోత్సవం భారతదేశంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జరుపుకుంటారు రామన్ ఎఫెక్ట్ ను కనిపెట్టిన చంద్రశేఖర వెంకట రామన్ తన పరిశోధన ఫలితాన్ని 28.2. 1928న ధ్రువపరచుకున్నాడు. ఈయన ఈ పరిశోధన ఫలితాన్ని ధ్రువపరచిన ఈరోజును నేషనల్ సైన్స్ డే గా మనమందరం జరుపుకుంటున్నాము. అదేవిధంగా పాఠశాల కరస్పాండెంట్ విద్యార్థులను మీరు కూడా రామన్ లాగా ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేసి సమాజంలో ఉన్నత స్థాయిని పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శేషగిరిరావు డైరెక్టర్ రంగారావు వైస్ ప్రిన్సిపల్ రూప డైరెక్టర్ రమ్య మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు శంకర్, వీరనాగేందర్, జ్యోతి, శ్రీనివాస్, భవాని, కరుణ మరియు పిల్లల తల్లిదండ్రులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది