Wednesday, 4 November 2026

దేనికైనారెడీ సినిమా పోస్టర్‌ దహనం

కరీంనగర్‌, నవంబర్‌ 5 (జనంసాక్షి) :
దేనికైనా రెడీ సినిమాలో బ్రాహ్మణులపై చిత్రీకరించిన అభ్యంతరకర దృశ్యాలను తొలగించాలని మాదిగ విద్యార్థి పోరాట సమితి ఆధ్వర్యంలో సినిమా పోస్టర్‌ దహనం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దేనికైనా రెడీ సినిమాలో బ్రాహ్మణులను అవమానపరచే దృశ్యాలు తొలగించాలని డిమాండ్‌ చేశారు. మోహన్‌బాబు, విష్ణులు గుండాల్లా ప్రవర్తించి బ్రాహ్మణులపై దాడి చేయడాన్ని ఖండించారు. ప్రజాస్వామ్యపద్దతిలో ధర్నా చేస్తున్న వారిపై రెచ్చిపోయి పిచ్చికుక్కల్లా మీదపడ్డారని అన్నారు. వీరిపై ప్రభుత్వం కేసులు నమోదు చేసి శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మాతంగి ఓదెలు, జిల్లా ఇన్‌చార్జి తిప్పారపు లక్ష్మన్‌, గోషికి అజయ్‌, మొలుగూరి అనిల్‌కుమార్‌, గోషికి శంకర్‌, అరికిల్ల మహేష్‌, అవినాష్‌, మంద శివ, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *