. హోంమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసిన బ్రహ్మణ సంఘం నేతలు
. కోర్టు అదేశాల మేరకు కేసు నమోదు
హైదరాబాద్: నవంబర్ 5(జనంసాక్షి) .
వివావదస్పదమైన దేనికైనా రెడీ సినిమా సోమావరం కొత్త మలుపు తిరిగింది. ఈ చిత్ర నిర్మాత మెహాన్‌బాబు, హీరొ మంచువిష్ణు, దర్శకుడు నాగేశ్వరరేడ్డి పై మాల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. మాల్కాజిగిరి కోర్టు అదేశాల మేరకు పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఇదిలా ఉండగా, ఈ చిత్రంలో ని అభ్యంతరకరమైన దృశ్యాలను తోలగంచలని లేదా సినిమానే నిషేదించాలని కోరుతూ బ్రాహ్మణ సంఘాల జెఎసి నేతలు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని లుసుకుని విజ్ఞాప్తి చేశారు, 24 గంటల్లో దర్శక, నిర్మాతలను ఆదుపులోకి తీసుకోవాలిని పట్టుబడ్డారు. ఏ చర్యలూ తీసుకోకుంటే త్వరలో కార్యచరణను ప్రకటిస్తామని బ్రాహ్మణ నేతలు హెచ్చారించారు. దేనికైనా రెడి ఎ ఉమన్ బ్రహ్మణిజం లాంటి చిత్రాలను వ్యతిరేకిస్తూ వివిధ జిల్లాలకుచెందిన బ్రాహ్మణ నాయకులు ఆదివారం హైదరాబాద్ ధర్న నిర్వహించిన సంగతి తెలిసిందే.




