ముంబయి నవంబర్ 5, (జనంసాక్షి)
పాక్ జట్టును భారత్‌లో ఆడనీయబోమని శివ సేన చీఫ్‌ధాక్రే అన్నారు గతం మరచి పాక్ జట్టు ఇక్కడ ఆడవచ్చన్న కేంద్ర మంత్రి సుషీల్‌కుమార్ షిండే తన ప్రకటన ఉపసంహరించుకోవాలని కోరారు ఏ మాత్రం సిగ్గున్నా షీండే తనప్రకటన వెనక్కు తీసుకోవాలని కోరారు శిసేన పార్టీ పత్రిక సామ్నాలో ఆమేరకు సంపాదకీయం రాశారు నేను మంచానపడి ఉన్నాను షిండే ప్రకటన చూసి నా రక్తం మరుగుతోంది.అందువల్ల హిందూ సోదరులు ఈమ్యాచ్‌లను అడ్డగించాలని కోరుతున్నాను.అని తెలిపారు.గతం మర్చిపోవాలని మీరు అంటున్నారు ఏమి మరచిపోవాలి ఎలా మరచిపోవాలి,, అని ఆయన ప్రశఅనించారు, పార్లమెంటు పై దాడిని ముంబయి టెర్రర్ దాడులను ఆయన ప్రస్తావించారు పాక్ జట్టు భారత్ పర్యటనను ఆయన జాతికి సిగ్గుచేటుగా అభివర్ణించారు ఇక అజ్మల్ కబబ్ క్షమాభిక్ష పిటిషన్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం తిసుకున్న నిర్ణయం దేశద్రోహమన్నారు.కేవలం డబ్బు కోసం
భారత్‌క్రికెటర్లను కూడా ముగ్గులోనికి లాగారన్నారు. ధాక్రే అన్న కుమారుడు రాజ్ ధాక్రే (ఎంఎన్‌ఎన్ చీఫ్ )కూడా
పాక్ జట్టు పర్యటనను వ్యతిరేకిస్తున్నారు.




