దేవరకొండ మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ ధీరావత్ రాగ్యా నాయక్ సేవలు మారువలేనివి పీసీసీ సభ్యులు, పిఎసిఎస్ చైర్మన్ జాల నర్సింహారెడ్డి
కొండమల్లేపల్లి డిసెంబర్ 29 జనం సాక్షి న్యూస్ :
గిరిజన నేత దేవరకొండ మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ ధీరవత్ రాగ్య నాయక్ సేవలు మారువలేనివి అని పీసీసీ సభ్యులు చిత్రీయల సింగిల్విండో చైర్మన్ జాల నర్సింహారెడ్డి అన్నారు. గురువారం దేవరకొండ పట్టణంలో యూవజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాగ్యనాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పిఎసిఎస్ చైర్మన్ జాల నరసింహారెడ్డి మాట్లాడుతూ ధీరావత్ రాగ్యా నాయక్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని, ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలను ఎప్పుడు ఆరాధించేవారని పేద ప్రజలు అభివృద్ధి చెందాలని, రైతులు సంతోషంగా ఉండాలని, రైతుల కోసం దేవరకొండ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి విజయవంతం చేశారని ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు ఈకార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కొర్ర రాంసింగ్ నాయక్.జరుప్ల లక్ష్మీ. నియోజకవర్గ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ.జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమెర్ కాశిం. నియోజకవర్గ ప్రదాన కార్యదర్శులు వివిఆర్. రమ్మీ, ఇంతియాజ్. యూవజన కాంగ్రెస్ నేతలు మహేందర్. కార్తిక్ మంగ్య నాయక్.సాయి రాథోడ్.మధు.రవి.జగన్.రాజు.చరణ్.కిషన్.ప్రభు.పవన్.ప్రసాద్.ఆనంద్. అజయ్. శివ. తదితరులు పాల్గొన్నారు
దేవరకొండ మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ ధీరావత్ రాగ్యా




