దేవర యంజాల్లోని రోడ్లన్నీ గుంతల మయంతో ప్రజలు ఇబ్బందులు

 శామీర్ పేట్, జనంసాక్షి : తుంకుంట మున్సిపాలిటీ నుంచి వయా కొంపల్లి వెళ్లే ప్రధాన రోడ్లన్నీ పెద్ద పెద్ద గుంతలతో వాహన దారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు
పడుతున్న స్థానిక మున్సిపల్ అధికారులు కాని ఆర్ అండ్ బి అధికారులు ఇటు వైపు కన్నెత్తి చూడకపోవడం సిగ్గు చేటని తుంకుంట కాంగ్రెస్ మున్సిపాలిటీ అధ్యక్షులు భీమిడి జైపాల్ రెడ్డి అన్నారు. శనివారం దేవర యంజాల్ పరిధిలో ఉన్న ప్రధాన రోడ్లు పూర్తిగా గుంతల మయం కావడంతో టిప్పర్ లారీ రోడ్ పై దిగబడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రజల బాగోగులు పట్టించుకోకుండా అధికారులు, కౌన్సిల్లర్లు ఎం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి కైనా సమస్యలు ప్రతి సారి
పునరావృతం కాకుండా చూడాలని, లేని పక్షంలో ప్రజలతోనే సమస్యలు పరిష్కరించేవరకు రోడ్లపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

తాజావార్తలు