:శామీర్ పేట్, జనం సాక్షి :
తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవరయాంజాల్ జిల్లా పరిషత్ పాఠశాల పదో తరగతి విద్యార్థులకు గత 6 సంవత్సరాల నుండి బర్రెంకబాయి దేవేందర్ రెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు బర్రెంకబాయి శ్రావంత్ రెడ్డి పదోవ తరగతి విద్యార్థులకు పరీక్షల సామాగ్రిని ఉచితంగా పంపిణీ చేశారు.అదేవిధంగా శుక్రవారం రోజు 7వ సంవత్సరం కూడా బర్రెంకబాయి శ్రావంత్ రెడ్డి,తూంకుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బి.జైపాల్ రెడ్డి,11 వ వార్డు కౌన్సిలర్ పి.నర్సింగరావు గౌడ్,లతో కలిసి పదోవ తరగతి విద్యార్థులకు ఉచితంగా పరీక్ష సామాగ్రిని పంపిణీ చేశారు.విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు స్వరూప రాణి,ఉపాధ్యాయులు హరికృష్ణ రెడ్డి,సుధాకర్,తిరుమలప్రసాద్,ఎస్తర్ రాణి,సుధాకర్ రెడ్డి,ప్రశాంత్ నాయక్,రామ్మోహన్ రావు, మంజులత మరియు విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.
24ఎస్పీటీ -1: విద్యార్థులకు పంపిణి చేస్తున్న దృశ్యం
దేవర యంజాల్ లో పదోవ తరగతి విద్యార్థులకు ఉచితంగా పరీక్షల సామాగ్రి పంపిణీ




