మునగాల,మార్చి 1(జనంసాక్షి): ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలమార్చుకోవాలని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మునగాల మండలం బరాఖత్ గూడెం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి పాలకమండలి ప్రమాణస్వీకారం మహోత్సవంలో బుధవారం ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని, వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆయన అన్నారు. తెరాస ప్రభుత్వం దేవాలయ అభివృద్ధికి పెద్ద పీట వేస్తుందని అన్నారు. నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఆ వెంకటేశ్వరస్వామి దీవెనలతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని అన్నారు. భగవంతుని ఆశీస్సులతో ఈ ప్రాంతం పసిడిపంటల తోటి వర్ధిల్లాలని అన్నారు. ఆ వెంకటేశ్వరస్వామి కృపతో పాడి పశువులు సిరి సంపదలతో ప్రజలందరూ జీవించాలని ఆకాంక్షించారు. నూతనంగా ఎన్నికైన పాలకవర్గం ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన చూసించారు. నూతన పాలకవర్గ అధ్యక్షులుగా బొంతు పుష్పవతిమోహన్ రావు, పాలకవర్గ సభ్యులుగా ప్రతాపనేని లావణ్య, గంధం రాంబాబు, నారగాని సైదులు, కొర్ర మాలు, ఎల్ గోపయ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొప్పుల వీరమ్మ, దేవదాయశాఖ ఇన్స్పెక్టర్ రమేష్, కార్యనిర్వణ అధికారి తుమ్మల వెంకట చలపతి, ఆలయ అర్చకులు కందాల శ్రీనివాసాచార్యులు, టిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు గోదాటి వెంకన్న, ఉప్పుల ఇంద్రరెడ్డి, పేనేపల్లి రమేష్ బాబు, మోహన్ రెడ్డి, బొంతు వంశీ, పాషా, దస్తగిరి, యూసఫ్, నాగరాజు పలువురు పాల్గొన్నారు.
దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషిదేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి- ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే




