దేశంలోనే ఎక్కడ లేని విదంగా తెలంగాణలో ఆసరా-ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు.
నెరడిగొండ సెప్టెంబర్2(జనంసాక్షి):
దేశంలోనే ఎక్కడ లేనివిదంగా తెలంగాణా రాష్ట్రంలో సిఎం కేసీఆర్ అదిక మొత్తంలో ఆసరా పింఛన్లు ఇస్తున్నారని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు.శుక్రవారం రోజున మండలంలొ కొత్తగా మంజరయిన ఆసరా పింఛన్ల గుర్తింపు కార్డులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ సందర్బంగాఆయన మాట్లాడుతూ వృద్దులకు, వితంతువులకు ఒంటరి మహిళలకు 2016 రూపాయలు వికలాంగులకు 3016 రూపాయలు పించన్ ఇస్తున్నామనితెలిపారు.ఎక్కవ మంది లబ్దిదారులకు పింఛను ఇస్తున్న రాష్ట్రం కూడా మనదేనని ఎమ్మెల్యే తెలిపారు. మన రాష్ట్రంలోఅమలవుతున్న సంక్షేమ పథకాలు చూసి సరిహద్దు రాష్ట్రాల ప్రజలు తెలంగాణాలో పుట్టక పోతిమని బాధపడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమంలో మండల జడ్పీటీసీ అనిల్ జాధవ్ ఎంపిపి రాథోడ్ సజన్ మార్కెట్ కమిటీ చైర్మన్ దావుల బోజన్న సీనియర్ నాయకులు అధికారులు వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపిటిసిలు పీఏసీఎస్ ఛైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.