దేశానికి దిక్సూచి గా తెరాస పాలన

అభివృద్ధి పధకాల పట్ల బీజేపీ రాష్ట్రాలే కితాబులుస్తున్నాయి
శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి
నల్గొండ బ్యూరో. జనం సాక్షి
దేశానికి దిక్సూచి గా తెలంగాణ రాష్ట్ర పాలన రూపొందిందని రాష్ట్ర శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. గురువారం మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు క్యాంపు కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్య మంత్రి కెసిఆర్ పాలన. సమర్ధత. సంక్షేమ పధకాలు దేశం లో బీజేపీ పాలిత రాష్ట్ర ప్రజలు. నేతలు మెచ్చుకుంటున్నారని.. తన 30 సంవత్సరాల రాజకీయ జీవితం లో ఇంతటి సమర్ధవంతమైన ముఖ్య మంత్రి ని చూడలేదన్నారు.రాష్ట్రం లో పచ్చదనం పెరిగి వర్షాలు విస్తారం గా కురుస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.వర్షాలు కురిసి… గోదావరి జలాల మళ్లింపు తో నూతన సాగునీటి ప్రాజెక్ట్ లను నిర్మించిన ఘనత కెసిఆర్ దే అన్నారు. రైతులకు ఆసరాగా ముఖ్య మంత్రి ఎంతో చేసారన్నారు.సాగునీటి ప్రాజెక్ట్ ల ఏర్పాటు తర్వాత లక్షల ఎకరాల భూమి సేద్యం అవుతుందన్నారు. అదే విధంగా రైతు బంధు పేరిట లక్షలాది రైతులకు ఆర్ధిక చేయూతనిచ్చారని పేర్కొన్నారు. బీజేపీ వి వట్టి మాటలేనని  తమకన్నా అధికంగా సంక్షేమ పధకాలను ప్రవేశపెట్టి మాట్లాడాలన్నారు. అధికారం లో పొరబాట్లు అనేవి సహజమన్నారు.సమావేశం లో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు. మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి. మండల పార్టీ అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. వైస్ చైర్మన్ కుర్రావిష్ణు. పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్. నాగార్జున చారీ. నియోజకవర్గ. మండల. పట్టణ నాయకులు పాల్గొన్నారు.
 

తాజావార్తలు