Wednesday, 4 November 2026

దేశీయ క్రీడలకు కేంద్రం ప్రోత్సాహం : వెంకయ్యనాయుడు

హైదరాబాద్, సెప్టెంబర్ 19 : దేశీయ క్రీడలను కేంద్రం ప్రోత్సహిస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. శనివారం రాజేంద్రనగర్ సరస్వతి శిశుమందిర్‌లో సౌత్ఇండియన్ స్పోర్ట్స్ మీట్‌ను వెంకయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సంప్రదాయాలను యువత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. క్రీడల ద్వారా విద్యార్థుల్లో సామాజిక ధృక్పథం వస్తుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు క్రీడలను ప్రోత్సహించాలని సూచించారు. దేశీయ క్రీడలకు అర్జున అవార్డులు ఇచ్చే యోచనలో కేంద్రం ఉన్నట్లు వెంకయ్య పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *