
వికారాబాద్ రూరల్ జూలై 6 జనం సాక్షి
దేశసేవకై పాటుపడిన ఆదర్శప్రాయుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని వికారాబాద్ జిల్లా బి ఆర్ ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు గురువారం స్వాతంత్ర సమరయోధులు మాజీ ఉప ప్రధాని *డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని వారి విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ కౌన్సిలర్లు అనంతరెడ్డి ప్రభాకర్ రెడ్డి గోపాల్ ముదిరాజ్ మండల పార్టీ అధ్యక్షుడు కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి బి ఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




