దైవ చింతనతో మానసిక ప్రశాంతత

-ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కల్గి ఉండాలి
-దేవరకొండ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్
కొండమల్లేపల్లి :సెప్టెంబర్ 30( జనం సాక్షి) :
దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది అని దేవరకొండ శాసన సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శుక్రవారం కొండమల్లేపల్లి పట్టణంలోని కన్యకపరమేశ్వరి దేవాలయంలో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కల్గి ఉండాలి అని ఆయన అన్నారు. దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఆయన అన్నారు. ఎమ్మెల్యే శ్రీ రామావత్ రవీంద్ర కుమార్ గారు కొండమల్లేపల్లి లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా ఈ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకరణలో వున్న అమ్మవారిని దర్శనం చేసుకున్నారు, ఎమ్మెల్యే గారిని పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వురే జనార్దన్, కార్యదర్శి గౌరు వెంకటేశ్వర్లు, కోశాధికారి చందా దనుoజయ్య , అంకిశేట్టి శేకర్, నెలoటి వెంకటేశ్వర్లు,విదియాల రామయ్య, యాదగిరి, బచ్చు శ్రీను, ఘనంగా ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ గారిని సన్మానించారు ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్ గౌడ్,జడ్పీటీసీ సలహాదారుడు పసునూరి యుగేందర్ రెడ్డి,రైతు బంధు అధ్యక్షుడు కేసాని లింగా రెడ్డి,మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్,ఉప సర్పంచ్ గంధం సురేష్,అబ్బానబోయిన శ్రీనివాస్, గుమ్మడవల్లి జనార్దన్ దితరులు పాల్గొన్నారు