హైదరాబాద్,జూన్21(జనం సాక్షి): రెండోపెళల్‌ఇ చేసుకుని తప్పించుకుని తిరుగుతన్న భర్తకు మొదటి భార్య గట్టిగా బుద్ది చెప్పింది. పట్టుకుని దేహశుద్ది చేసింది. ఈ ఘటన నగరంలోని చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇక్కడే క ఆపురం పెట్టిన భర్తకు మొదటి భార్య దేహశుద్ధి చేసింది. హనుమాన్ నగర్‌లోని ఒక అపార్ట్‌మెంట్లో రెండో భార్య ప్రత్యుషతో నివాసం ఉంటున్న ఇంటిపై మొదటి భార్య రమణి, ఆమె బంధువులు దాడి చేసి రెండ్ హ్యాండ్‌గా పట్టుకుని భర్తకు దేహశుద్ధి చేశారు. సాప్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న అనిల్ శేషుకుమార్ 2009లో రాజమండ్రికి చెందిన రమణితో వివాహం జరిగింది. 2013 నుంచి మొదటి భార్యకు దూరంగా ఉంటూ రెండో భార్య ప్రత్యుషతో కాపురం చేస్తున్నాడు. ఈ రోజు గుర్తించిన రమణి బంధువుల సహాకారంతో భర్తను పట్టుకుని దేహశుద్ధి చేసింది. కేవలం డబ్బు కొరకే తనను పెండ్లి చేస్తుకుని మోసం చేశాడని తనకు, తన కూతురికి న్యాయం చేయచేయాలని రమణి పోలీసులకు ఫిర్యాదు చేసింది.




