హైదరాబాద్,జూలై17(జనం సాక్షి): పెళ్లిపేరుతో యువతిని మోసం చేసిన దొంగమొగుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాంగ్ కాల్ చేసిన ఓ యువతితో పరిచయం పెంచుకున్న వ్యక్తి ఆమెను వివాహమాడి మోసం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుణ్ని అరెస్టు చేశారు. ఎస్సార్‌నగర్ పోలీసుల వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లికి చెందిన వంశీ(22) ఫోన్‌కు నాలుగేళ్ల కిందట ఎల్లారెడ్డిగూడకు చెందిన ఓ యువతి పొరపాటున ఫోన్ చేసింది. ఇదే అదనుగా వంశీ ఆ యువతికి తరచూ ఫోన్ చేస్తూ పరిచయం పెంచుకున్నాడు. ప్రేమిస్తున్నానని చెప్పడంతో నమ్మింది. ఆమెను వంశీ తాళి కట్టి పెళ్లి చేసుకున్నాడు. చివరకు ముఖం చాటేసి తప్పించుకొని తిరుగుతుండటంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుణ్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.




