మల్కాజిగిరి.జనంసాక్షి.జూలై 7
దొంగతనం జరిగిన గంటల వ్యవధిలోనే దొంగను పట్టుకొని సొత్తును స్వాధీనం చేసుకున్నామని నెరెడ్ మెట్ సిఐ నరసింహస్వామి తెలిపారు.ద్వారకమై కాలనీలో నివాసముంటున్న ఆనంత బాబు కుటుంబ సభ్యులతో కలిసి ఈనెల 5న ఇంటికి తాళం వేసి తిరుపతి వెళ్ళాడు.అదే రోజు రాత్రి తాళం వేసిన ఇంట్లో దొంగలు పడి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు.దర్యాప్తులో భాగంగా పరిసర ప్రాంతాలలో ఉన్న సీసీ ఫుటేజీ ఆధారంగా మౌలాలి ఆర్టీసీ కాలనీలో నివాసముంటున్న పాత నేరస్తుడు పిన్నింటి రోహిత్(21)ని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు.అతనిపై మల్కాజిగిరి,కుషాయిగూడ, చిలకలగూడ,నేరెడ్ మెట్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు.నిందితుడి నుండి 16 తులాల బంగారం 10 తులాల వెండి నగలు స్వాధీనం వేసుకుని రిమాండ్ కు తరలించామని చోరీకి గురైన సొత్తు విలువ ఎనిమిది లక్షలు ఉంటుందని తెలిపారు.తక్కువ సమయంలోనే దొంగలను పట్టుకున్న పోలీసులను రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ అభినందించారు.




