ఇదే గ్యాంగ్‌లో నజీర్ కూడా చేరాడు. ఈ క్రమంలో కరసేవకు వెళ్లి వచ్చిన బీజేపీ నేతలు నంద్‌రాజ్‌గౌడ్, పాపయ్యగౌడ్‌లను ఈ ముఠా 1993లో హత్య చేసిందని వారిపై అప్పట్లోనే పోలీసులు కేసు నమోదు చేశారు. అదే ఏడాది ఫసీయుద్దీన్, రఫీయుద్దీన్, మహ్మద్ అలీలు కార్ఖానా పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. మరో నిందితుడు మీర్జా ఫయాజ్‌బేగ్ 1996లో నాంపల్లి కోర్టు నుంచి పారిపోయి, అదే ఏడాది జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు.
అయితే ఈ కేసులు కోర్టులో వీగిపోయాయి. మరోపక్క కరసేవకులను అంతమొందించేందుకు కావాల్సిన ఆర్థిక వనరులు సమకూర్చేందుకు నజీర్ అబిడ్స్‌లో 1993లోనే పెద్ద దోపిడీకి పాల్పడ్డాడు. అనంతరం అతను దుబాయ్‌కి పారిపోవడంతో ఈ కేసులో అతన్ని పోలీసులు ఇంతవరకు అరెస్టు చేయలేకపోయారు. ఇటీవల నజీర్ నగరానికి రావడంతో సీసీఎస్, సిట్ పోలీసులు అతని ఇంటిపై దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇతనిపై రెండు నాన్ బెయిలబుల్ వారంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే నజీర్ ఏ పేరుతో పాస్‌పోర్టు పొందాడు, దుబాయ్‌కి ఎలా వెళ్లాడు అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.




