Thursday, 5 November 2026

దోమకొండ కోటలో బాలల వారోత్సవాలు…

దోమకొండ కోటలో బాలల వారోత్సవాలు…
కామారెడ్డి ప్రతినిధి నవంబర్11 (జనంసాక్షి);
కామారెడ్డి జిల్లా దోమకొండ కోటలో బాలల వారోత్సవాలు
శుక్రవారం బాలల వారోత్సవాల్లో భాగంగా బాలల హక్కులు మరియు సురక్షిత వాతావరణం లో పెరిగే అవకాశాలను ముఖ్యంగా ఆడపిల్లలపై జరిగే వివిధ రకాల వేధింపులను అరికట్టడానికి ప్రభుత్వం మరియు స్వచ్ఛంద సంస్థలు వివిధ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా శుక్రవారం ఐసిపియస్ మరియు దోమకొండ ట్రస్ట్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీలు నిర్వహించారు. అనంతరం దోమకొండ కోటలో బాలల హక్కులు వారి పరిరక్షణ అనే అంశాలపై గ్రామ సర్పంచ్ నల్లపుఅంజలి శ్రీనివాస్ దోమకొండ ఎస్సై సుధాకర్ బాల రక్షణ భవన్ కోఆర్డినేటర్ జానకి ఐసిడియస్ సూపర్ వైజర్ నిర్మల, ఐసిపియస్ ప్రతినిధులు,1098 ప్రతినిధులు దోమకొండ ట్రస్ట్ చైర్మన్ బాబ్జి పిల్లల హక్కులు మరియు వారి పరిరక్షణ చట్టాలు లాంటి వాటిని క్షుణ్ణంగా వివరిస్తూ, పిల్లలు వారికి అందుతున్న సేవలు అదేలా పిల్లలకి సురక్షిత వాతావరణం కల్పించడంలో మనందరి బాధ్యత అని వివరిస్తూ కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమంలో ట్రస్టు ప్రతినిధులు గణేష్ యాదవ్, వినోద్, శ్రీకాంత్ , అభ్యుదయ,త్రివేణి, ప్రభుత్వ పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయులు , ఉపాధ్యాయులు పిల్లలు పాల్గొన్నారు.