ధర్మపురి నియోకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ స్థానికేతరులకు కాకుండా స్థానికుడు అయిన గజ్జెలు స్వామి కి టికెట్ ఇవ్వాలని డిమాండ్
ధర్మపురి (జనం సాక్షి)పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యకర్తలు శ్రేయోభిలాషులు మహిళలు అంబేద్కర్ చౌరస్తా నుండి పాదయాత్రతో పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీగా బయలుదేరి స్థానికులకే MLA టికెట్ ఇవ్వాలని, పటేల్ గార్డెన్ వరకు పాదయాత్ర చేస్తూ సభ మందిరానికి చేరుకొని సభనువిజయవంతం చేశారు. వివిధ నాయకులు మాట్లాడుతూ, గత 15 సంవత్సరాల నుండి ధర్మపురి నియోజకవర్గ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ నుండి ఐదు సార్లు అవకాశం ఇచ్చినప్పటికీ కూడా తన అసమర్థతతో విజయం సాధించలేకపోయారు మధ్యతరగతి కుటుంబానికి చెందిన స్థానికుడు అయిన గజ్జెల స్వామి కి కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఇవ్వాలని సభా ముఖంగా ప్రజాప్రతినిధులు కార్యకర్తలు మహిళలు అందరూ కలసి తీర్మానం చేస్తూ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కి వినతి పత్రాన్ని ఇవ్వడం జరుగుతుందని, తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ధర్మారం మండల మాజీ ఎంపిటిసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుపాలకుర్తి రాజేశం గౌడ్, నందగిరి ఉపసర్పంచ్ గోపు అశోక్ రెడ్డి, పెగడపల్లి మండల మాజీ వైస్ ఎంపీపీ గండ్ర వెంకట్రావు, సంఘనపల్లి శంకరయ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గొల్లపల్లి సంతోష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యాళ్ల నంది రెడ్డి, కుమార్ నాయక్, కుమార్, రాజేందర్ రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ కుచన పెళ్లి దుర్గయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఐతరవేణి కొమురయ్య, పులిప్రేమిత్ కుమార్ కిట్టు, రాము, చిన్ను, సుంకరి రవి,పటేల్ సత్యనారాయణ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేశారు.