హైదరాబాద్,(జనంసాక్షి): మాజీమంత్రులు ధర్మాన ప్రసాద్‌రావు, సబితా ఇంద్రారెడ్డి జ్యూడిషియల్ కస్టడీపై విచారణ వాయిదా పడింది. నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 19 వ తేదీకి వాయిదా వేసింది. జగన్మోహన్‌రెడ్డి కంపెనీల్లో అక్రమంగా పెట్టుబడులు తరలించేందుకు అనువుగా ఆదేశాలను జారీ చేశారనే అభియోగంపై విచారణను ఎదుర్కొంటున్న మాజీ మంత్రులు ధర్మానప్రసాద్‌రావు, సబితా ఇంద్రారెడ్డిలను జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలని సీబీఐ మెమో దాఖలు చేసిన విషయం తెలిసిందే.




