*ధాన్యం కొనుగోళ్లను సత్వరమే చేపట్టాలి*

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మార్కెట్ పరిశీలన
రామన్నపేట అక్టోబర్ 22 (జనంసాక్షి)
రామన్నపేట మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోళ్ల ను సత్వరమే చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీటీసీ సాల్వేర్ అశోక్, పట్టణ అధ్యక్షులు ఎండి జమీరుద్దీన్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం స్థానిక మార్కెట్ యార్డులో రైతుల ధాన్యాన్ని పరిశీలించారు .అనంతరం మాట్లాడుతూ రైతు సంక్షేమం చెప్పుకునే ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. సత్వరమే ధాన్యం కొనుగోలు చేబట్టి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహమ్మద్ ఎజాజ్, మహబూబ్ అలీ,మహమ్మద్ జానీ, గురుకు శివ, మహమ్మద్ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.