Monday, 2 November 2026

నంద్యాలలో ముగ్గురు దొంగల అరెస్ట్‌

కరీంనగర్‌: నంద్యాల పట్టణంలోని ఎస్భీఐ కాలనీలో మోటర్‌ బైక్‌పై వస్తున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకుని నంద్యాల రెండో పట్టణ సీఐ రామాంజనాయక్‌ సోదా చేశారు. వారివద్ద 90గ్రాముల బంగారునగలు లభ్యం కావటంతో వారిని స్టేషన్‌కు తీసుకెళ్లీ విచారించారు. వారిని రైతునగరం గ్రామానికి చెందిన శివప్రసాద్‌, బండి ఆత్మకూరు గ్రామానికి చెందిన సుదర్శన్‌, తమ్మడపల్లె గ్రామానికి చెందిన బాలరాజులుగా గుర్తించారు. జూన్‌ 29న రోజుకుంట మసీద్‌ వద్ద ఒంటరిగా వెల్తున్న శైలజ అనే మహిల మెడలోని గొలుసును, ఆగస్ట్‌ 21వ తేది రాత్రి ఎన్టీఓస్‌ కాలనీలో బట్టు గీత మెడలోంచి గొలుసును అపహరించారు. ఈ మెరకు వీరిపై కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపరిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *