Thursday, 5 November 2026

నకీలపత్రాల తయారీలో న్యాయవాదితో సహా మరొకరి అరెస్టు

కామారెడ్డి: అత్యాచార ఘటనలో నిందితుడిగా ఉన్న వ్యక్తి చనిపోయినట్లు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించి కోర్టులో దాఖలు చేసిన న్యాయవాధి భాస్కర్‌రావు, నిందితుడు స్వామిగౌడ్‌లను అరెస్టు చేసినట్లు సీఐ కృష్ణ తెలిపారు. నిందితుడు బతికుండగానే చనిపోయినట్లు గ్రామ కార్యదర్శి జారీ చేసినట్లు పత్రాలు సృష్టించి కోర్టులో సమర్పించారని తెలిపారు. అనుమానం రావడంతో విచారణ చేయగా వారి బండారం బయట పడిందని తెలిపారు. నిందితుల నుంచి పత్రాలు స్టాంపులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *