హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రాల రాజధాని నగరమైన హైదరాబాద్లో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. రోజురోజుకీ చోరీల సంఖ్య పెరుగుతోందే కానీ తగ్గుముఖం పట్టే పరిస్థితి కనిపించలేదు. తాజాగా శుక్రవారం మరో ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నగరం రాజేంద్రనగర్ బండ్లగూడలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దుండగులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఏకంగా 40 తులాల బంగారం, 20 తులాల వెండి, రూ.40 వేలు నగదు అపహరించుకుని పోయారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా వివరాలు తెలియరావాల్సి ఉంది.




