Wednesday, 4 November 2026

నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల ప్రాంతాన్ని సందర్శంచి, క్షతగాత్రులను పరామర్శిచేందుకు నేడు హైదరాబాద్‌కు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ రానున్న నేపధ్యంలో నగరంలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ పలు మార్గాల్లో వాహనాల రాకపోకలపై నిషేధం అమలులో ఉంటుంది. నల్గొండ క్రాస్‌ రోడ్‌ నుంచి కొత్తపేట వైపు వచ్చే వాహనాలను ఎల్బీనగర్‌, ఉప్పల్‌ వైపు దారి మళ్లించారు. ఎల్బీనగర్‌ నుంచి రాజీవ్‌చౌక్‌ వైపు, సరూర్‌నగర్‌ పోస్టాఫీస్‌ నుంచి హుడా కాంప్లెక్స్‌ వైపు వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. ఎల్బీనగర్‌, తహసీల్దార్‌ కార్యాలయం నుంచి రాజీవ్‌ చౌక్‌ వైపు రహదారిని మూసివేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *