హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబుపేలుళ్లు జరిగిన ప్రాంతాన్ని సందర్శంచి, క్షతగాత్రులను పరామర్శించేందుకు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ఆదివారం ఉదయం నగరానికి వస్తున్నారు. ఉదయం 9 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయల్దేరి 11.05కి బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. 11.10కి అక్కడి నుంచి సరూర్‌నగర్‌లోని విక్టోరియా స్మారక గృహానికి (వీఎంహోం) హెలికాప్టర్‌లో చేరు కుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన దిల్‌సుఖ్‌నగర్ వెళ్లి పేలుళ్లు జరిగిన ప్రాంతాన్ని సందర్శిస్తారు. అనంతరం యశోదా, ఓమ్ని ఆసుపత్రుల్లో బాధితులను పరామర్శిస్తారు. మధ్యాహ్నం 1.05కి అక్కడి నుంచి మళ్లి వీఎం హోమ్‌కు చేరుకొని హెలికాప్టర్‌లో బేగంపేటకు వెళ్తారు. 1.25కి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనమవుతారు.




