:హైదరాబాద్ జంట కమిషనరేట్లలో గొలుసు దొంగలు అలజడి సృష్టించారు. శుక్రవారం రాత్రి పది గంటల తర్వాత పలు ప్రాంతాల్లో మహిళల మెడల్లోంచి గొలుసులు లాక్కెళ్లారు. నారాయణగూడ, అఫ్జల్‌గంజ్, గాంధీనగర్, బహదూర్‌పుర, మాదాపూర్ ఠాణాల పరిధిలో ఈ సంఘటనలు జరిగాయి. అంతకుముందు సాయంత్రం సమయంలో అమీర్‌పేట ప్రాంతంలోనూ చోరీకి పాల్పడ్డారు.
పురానాపూల్ రోడ్డులో ఉన్న పెట్రోల్‌బంో వద్ద రాత్రి 11:30 గంటల సమయంలో భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నర రేఖా జాజూ మెడలోంచి సుమారు 15 గ్రాముల బంగారు గొలుసు లాక్కెళ్లారు. నల్లరంగు పల్సర్‌పై ఇద్దరు దొంగలు వచ్చినట్లు బాధితులు తెలిపారు.
మాదాపూర్ అయ్యప్ప సొసైటీ పీజీఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ సమీపంలో రాత్రి 10:00 గంటల సమయంలో లక్ష్మీదేవి(45) మెడలోంచి మూడు తులాల గొలుసును అపహరించారు. ఏడుస్తున్న మనవడిని ఆడించేందుకు ఆమె ఇంటి బయటకు రాగా ముఖానికి ముసుగులు ధరించిన ఇద్దరు ద్విచక్ర వాహనంపై వచ్చి గొలుసు లాక్కెళ్లారు.
గాంధీనగర్ ఠాణా పరిధిలో 8 తులాల గొలుసు అపహరించారు. బన్సీలాల్‌పేట ప్రాంతానికి చెందిన శ్రీశైలజ రాత్రి 10:00గంటల సమయంలో భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. ¬ం ఫర్ డిసేబుల్డ్ ప్రాంతంలో నల్లరంగు పల్సర్‌పై వెనుకవైపు నుంచి వచ్చారు.
ఎంజీబీఎస్ సమీపంలో స్థానిక పండ్ల వ్యాపారి శారద(50) నందిని ¬టల్ వద్ద నడుచుకుంటూ వెళ్తుండగా నల్లరంగు పల్సర్‌పై ఎదురుగా వచ్చిన దొంగలు ఆమె మెడలోని 2 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు.
రాంకోఠికి చెందిన స్వర్ణలత రాత్రి పది గంటల సమయంలో భర్తతో కలిసి తితిదే కల్యాణ మండపంలో శుభకార్యానికి వెళ్లి వస్తున్నారు. నారాయణగూడ క్రిస్టియన్ సమాధుల వద్ద గొలుసుచోరీ జరిగింది. ఆమె నుంచి తొమ్మిది తులాల గొలుసును ఎత్తుకెళ్లారు.
మధ్యాహ్నం వేళ: అంబర్‌పేటకు చెందిన విశ్రాంత ఎస్సై(రైల్వే) హనుమంతరావు అతని భార్య కనకమ్మ(55) జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి వెళ్లేందుకు బస్సులో యూసుఫ్‌గూడ చెోపోస్టుకు వచ్చారు. అక్కడ షేరింగ్ ఆటో ఎక్కేందుకు చెోపోస్టులో ఉండగా ముగ్గురు మహిళలతో ఉన్న ఆటో అక్కడికి వచ్చింది. ‘ఎక్కడికి వెళ్లాలంటూ’ వారిని ప్రశ్నించి మరీ ఆటోలో కూర్చోమన్నారు. ఆటో వెనుక సీటులోనే అయిదుగురు సర్థుకుని కూర్చున్నారు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత ముగ్గురు మహిళలు ఆటో దిగి వెళ్లిపోగా.. హనుమంతరావు, కనకమ్మ అపోలో ఆసుపత్రికి వరకు వెళ్లారు. ఆస్పత్రి వద్ద ఆటో దిగిన తర్వాత కనకమ్మ తన గొలుసు చోరీకి గురైన విషయాన్ని గుర్తించారు.




