– సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యాపారి
– నిందులను అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్, నవంబర్30(జనంసాక్షి): గ్యాంగ్‌స్టర్ నయీమ్ చనిపోయిన తర్వాత కూడా అతడి పేరుతో బెదిరింపులకు పాల్పడుతూ వసూళ్లుకు పాల్పడుతున్న యువకుడిని రాచకొండ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. నల్గొండ జిల్లా సీఎపల్లికి చెందిన నగేశ్ అనే యువకుడు హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఉంటున్నాడు. ఈనెల 24న చంపాపేట్‌లో ఉండే మహేశ్‌బాబు అనే వ్యాపారికి ఫోన్ చేసి నయీమ్ పేరుతో బెదిరించాడు. రూ.కోటిన్నర ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులు దర్యాప్తు చేపట్టి నగేశ్‌ను పట్టుకున్నారు. నిందితుడు చెడువ్యసనాలకు బానిసై సులువుగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతోనే ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నయీంతో గానీ అతడి అనుచరులతో గానీ నగేశ్‌కు ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు.




