టేకులపల్లి, ఏప్రిల్ 19( జనం సాక్షి): టేకులపల్లి మండలం లో గ్రామపంచాయతీలు నిర్వహిస్తున్న నర్సరీలను, గ్రామీణ ఉపాధి హామీ పనులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి విద్యాలత బుధవారం తనిఖీ చేశారు. ఈ మేరకు బేతంపూడి గ్రామపంచాయతీలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను, నర్సరీలను తనిఖీ చేసినారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడారు. కూలీలు వేతనం ఎక్కువ వచ్చే విధంగా ఎక్కువ సేపు పని చేయాలని, వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినారు. ఈ కార్యక్రమంలో బేతంపూడి గ్రామ పంచాయితీ సర్పంచ్ ఎదలపల్లి బాబు, ఏపీ ఓ కాలంగి శ్రీనివాస్, కార్యదర్శి మీనా కుమారి, టి ఏ చాంద్మల్, ఫీల్డ్ అసిస్టెంట్ భద్రం పాల్గొన్నారు.




