నర్సరీ  చెరువుల యాజమాన్యం గురించి వివరిస్తున్న కెవికె ఇంచార్జీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ బి. లవకుమార్ 

గరిడేపల్లి, ఆగస్టు 2 (జనం సాక్షి): చేప పిల్లల ఉత్పత్తి క్షేత్రాన్ని నిర్వహించే రైతులు నర్సరీ చెరువుల నిర్వహణ యాజమాన్యం పై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని  కెవికె ప్రోగ్రామ్ కోఆర్డినేటర్  హెడ్ ఇంచార్జీ  లవకుమార్  అన్నారు. మంగళ వారం  కేవీకే  గడ్డిపల్లి లో షెడ్యూల్డ్ కులాలకు చెందిన  యువతకు  జాతీయ మస్థ్య అభివృద్ధి మండలి  ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద  సెంటర్ ఫర్ ఇన్నో్వేషన్స్  ఇన్ పబ్లిక్ సిస్టమ్స్ వారి  సహకారంతో   నిర్వహిస్తు  శిక్షణ కార్యక్రమం లో నర్సరీ రియరింగ్  చెరువుల నిర్వహణలో తీసుకోవాల్సిన పద్ధతులపై  అవగాహన కల్పించారు .   నర్సరీ చెరువుల ను 5-10 సెంట్ల విస్తీర్ణంలో దీర్ఘ చతుస్రాకారంలో  కనీసం 3 అడుగుల లోతు ఉండేలా నిర్మించుకోవాలని  తెలియజేసారు. వీటిలో స్పాన్ 5 మి.మీ సైజ్ చేప పిల్లలను ఫ్రై 25 మి.మీ సైజ్ వరకు తగిన దాణా ఇస్తూ మూడు వారాల పాటు పెంచుకోవాలని అన్నారు. అదే విధంగా రేరింగ్ చెరువులను పావు ఎకరం నుండి ఎకరం సైజ్ వరకు చతురస్రాకరం  దీర్ఘ చతురస్రాకారంలో 4-5 అడుగుల లోతు ఉండేలా నిర్మించుకోవాలని వీటిలో ఫ్రై 25 మి.మీ  సైజ్ చేప పిల్లలను ఫింగరింగ్ 60-80 మి.మీ సైజ్ వరకు 45 రోజులపాటు తగిన దాణా ఇస్తూ పెంచుకోవాలని అన్నారు.చెరువులను బాగా ఎండ నిచ్చి దున్ని శత్రు చేపలను నివారించడం కలుపు చేపలను నిర్మూలించడం  నీటి కలుపు మొక్కలు నీటి పురుగులను నిర్మూలించడం చేపట్టిన తర్వాత సున్నం చల్లి రసాయనిక సేంద్రీయ ఎరువులు వాడి ప్లవకాలను అభివృద్ధి చేసిన పిదప స్పాన్ ను చెరువుల్లో వదులుకోవాలని సూచించారు. తద్వారా అధిక ఆదాయాన్ని పొందవచ్చునని అన్నారు.ఈ శిక్షణలో  వీరాస్వామి,సందీప్, నరేష్, సైదులు, నవ్య, ప్రమీల, సరస్వతి, బేబీ, శ్రావణి, ప్రణీత,శ్రీవాణి,సురేందర్, వంశీ, మనోజ్,  కుర్రి వెంకన్న, రమేష్ తోపాటు 30 మంది పాల్గొన్నారు.

తాజావార్తలు