హైదరాబాద్, మార్చి 24: నగరంలోని సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నలుగురు దొంగలు పోలీసులకు పట్టబడ్డారు. వీరి నుంచి రూ.40 లక్షల విలువైన కంటైనర్, స్టీల్ సామగ్రిని స్వాధీనపరుచుకున్నారు. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో పోలీసులు దొంగలను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.




