నల్గొండ అభివృద్ధి పనులు సత్వరమే పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాలి
నల్గొండ బ్యూరో. జనం సాక్షి
పట్టణంలో జరుగుతున్న అన్ని అభివృద్ధి పనులు సత్వరమే పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను, ఇంజనీర్లను, కంట్రాక్టర్లను, ఏజెన్సీ నిర్వాహులను కోరారు. గురువారంనాడు నల్లగొండ పట్టణంలో జరుగుతున్న అభివృద్ది పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చర్లపల్లిలో అర్బన్ పార్కు పనులు పరిశీలించి మొక్కలు ఏపుగా ఏదిగేలా అవసరమైన ట్రీ గార్డులను ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు. ఎంట్రన్స్ గేట్ వద్ద పరిశీలించి తగు సూచనలు చేశారు. అర్బన్ పార్కు నిర్మాణంలో భాగంగా వచ్చే సందర్శకుల కోసం పార్కింగ్, ఫుడ్ కోర్టు, టాయ్ లెట్స్ వంటి మౌలిక సౌకర్యాల గురించి మున్సిపల్ కమీషనర్ తో చర్చించారు. అర్బన్ పార్కులో షిప్టింగ్ చేసిన మొక్కలను పరిశీలించారు. మర్రిగూడ బైపాస్ జంక్షన్ అభివృద్ధి పనులలో భాగంగా మిషన్ బగీరథ ట్యాప్, అశోక చక్ర, వెల్ కమ్ నల్లగొండ స్థలాలను పరిశీలించారు. అంతేగాక అక్కడ అవసరమైన వాటర్, ఎలక్ర్టిసిటీపై చర్చించారు. హైదరాబాద్ రోడ్డు డివైడర్ల మధ్యలో అమర్చుతున్న చార్జబుల్ లైట్స్ పనులు ఎప్పటి వరకు పూర్తి చేస్తారని ఏజెన్సీ నిర్వాహుకులను అడిగి తెలుసుకున్నారు. ఎలక్ట్రీకల్ టవర్స్ క్లాక్ టవర్ వరకు ఎక్కడా పెండింగులో ఉంచకుండా వెంటనే పనులను పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీర్లను ఆదేశించారు. పట్టణంలో రెండు సైడ్లలలో రోడ్డు పనులు జరుగుతున్న ప్రాంతాలలో బస్తాలలో మట్టిని నింపి వరుసగా పెట్టడం లేదా సూచికలతో కూడిన బోర్డులను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ రోడ్డులోని ఎల్.వి. పెట్రొల్ బంకు నుండి క్లాక్ టవర్ వరకు జరుగుతున్నరోడ్డు పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ ను కోరారు. రోడ్డుకు ఒక సైడ్ పూర్తి చేసి ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా వెంటనే మరోక సైడ్ లో పనులు పూర్తి చేయాలని అన్నారు. వర్షాలు పడే అవకాశం ఉన్నందున టార్గెట్ పెట్టుకుని రెండు షిప్టులలో పనులు చేయాలని అన్నారు. పట్టణంలో జరుగుతున్న డ్రైనేజీ పనులపై స్పందిస్తూ రోజు వారీగా పనులను పర్యవేక్షించాలని మున్సిపల్ కమీషనర్ ను ఆదేశించారు. బీట్ మార్కెట్ యార్డులోని వెజ్, నాన్ వెజ్ మార్కెటింగ్ పనులను పరిశీలించారు. మార్కెట్ ను అనుగుణంగా ఫ్లాట్ ఫామ్, గ్రానైట్, ఎలక్ట్రిసిటీ, వెల్ వేషన్ పనులను వేగంగా జరగాలని సంబంధిత కాంట్రాక్టర్ ను ఆదేశించారు. మార్కెట్ లోని రేట్లను సూచించే ఎల్.ఇ.డి. స్ర్కీన్ పై మున్సిపల్ కమీషనర్ తో చర్చించాలని సంబంధిత కాంట్రాక్టర్ ను కోరారు. క్లాక్ టవర్ సెంటర్ లో నూతనంగా నాలుగు కూడళ్లకు కనిపించే విధంగా క్లాక్ టవర్‌తో పాటు జాతీయ జెండా ఏర్పాటు, ఫౌంటేన్, మొదలగు అన్ని రకాల పనులపై మున్సిపల్ కమీషనర్ తో చర్చించారు. క్లాక్ టవర్ సెంటర్ లోని మార్కింగ్ ప్రకారం షాపులను తొలగించే పనులను పర్యవేక్షించాలని ఇంజనీర్లను కోరారు. దేవరకొండ రోడ్డులోని పనులు వేగంగా జరిగేటట్లు సంబంధిత ఇంజనీర్లు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. డి.ఇ.ఓ. ఆఫీస్ వరకు ఎప్పటి వరకు పూర్తి అవుతుందో నివేదిక రూపరలో తనకు సమర్పించాలని ఆయన అధికారులకు తెలిపారు. అనంతరం రామ్ నగర్ పార్కులో పర్యటించి అక్కడ వ్యర్థంగా నిరుపయోగంగా ఉన్న పరికరాలను వెంటనే తరలించాలని ఇంజనీర్లను ఆదేశించారు. బోటింగ్ ప్రాంతాన్ని పర్యటించి అక్కడ సందర్శకులను ఆకర్శించే విధంగా అందంగా పేయింట్స్, మొక్కలతో అలంకరించాలని సూచించారు. టికెట్ కౌంటర్లు, ఇటీవల పూర్తి చేసిన బెంచీలను, ఫౌంటేన్, ఆర్చ్ పనులను పరిశీలించి విద్యుత్ మరమ్మత్తులు చేయాలని తెలిపారు. పిల్లలు ఆడుకునే వస్తువులకు కలరింగ్ చేయించాలని సూచించారు. అంతేగాకుండా పార్కులోని ట్రాక్స్ ను కూడా కలర్స్ తో అందంగా తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. లవ్ నల్లగొండ, బీర్ పార్కు, బటర్ ఫ్లై పార్కు స్థలాలను పరిశీలించి అధికారులు, ఏజెన్సీలకు సూచనలు జారీ చేశారు. పార్కులలో ఎంట్రెన్స్, ఫుడ్ కోర్టు, పార్కింగ్, టాయ్ లెట్స్, బోటింగ్, మొదలగు ప్రాంతాలలో ఏర్పాటు చేసే నేమ్ బోర్డులు వుడ్ ఫ్రేమ్ బోర్డులలో మాత్రమే ఏర్పాటు చేయాలని సంబంధిత ఏజెన్సీ నిర్వాహులను కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మున్సిపల్ కమీషనర్ డా. రమణాచారి, అధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, ఏజెన్సీ నిర్వాహుకులు, తదితరులు పాల్గొన్నారు.