Wednesday, 4 November 2026

నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి లో సిబ్బందిని సస్పెండ్ చేయాలి పానగంటి మహేష్ గౌడ్

నాంపల్లి సెప్టెంబర్ 20( జనం సాక్షి ) జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నా నిర్లక్ష్యపు డాక్టర్లు, సిబ్బందిని తొలగించాలని భారతీయ జనతా పార్టీ యువ మార్చా జిల్లా కోశాధికారి పానుగంటి మహేష్ అన్నారు.నాంపల్లి మండల కేంద్రంలో విలేకరుల సమావేశం ఆయన మాట్లాడుతూ 9 నెలల గర్భవతి పై దుర్భాషలాడి అఖిల మృతికి కారకులైన ఆసుపత్రి సిబ్బంది సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.మృతి చెందిన అఖిల కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. జిల్లా లోని అనేక మార్మూల ప్రాంతాలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సరైన వసతులులేక,సిబ్బంది వున్న నిర్లక్ష్యంతో పనిచేయక పోవడంతో రోగులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు. అర్ధరాత్రి గ్రామాల్లో ప్రమాదం జరిగితే నిరుపేదల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని,దీనిపై ప్రభుత్వం ఉన్నతాధికారులు విచారణ జరిపించి,ఆస్పత్రుల్లో తనిఖీలు చేసి ఉద్యోగులను నియమించి సరైన సేవలు అందించాలని డిమాండ్ చేశారు.