Monday, 2 November 2026

నల్లగొండలో కాంగ్రెస్‌కు షాక్‌

కేటీఆర్‌ సమక్షంలో తెరాసలో చేరిన ధరనికోట రాము
నల్లగొండ,నవంబర్‌29(జ‌నంసాక్షి): నల్లగొండలో కాంగ్రెస్‌ కు మరో షాక్‌ తగిలింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిలుకల గోవర్ధన్‌, మరో సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, న్యాయవాది ధరనికోట రాము ఇతర అనుచరులతో కలిసి టీఆర్‌ఎస్‌ లో చేరారు. తెలంగాణా భవన్‌లో గురువారం ఉదయం చిలుకల గోవర్ధన్‌ ఆయన అనుచరులకు మంత్రి కేటీఆర్‌ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 60 ఏండ్ల అనుబంధాన్ని తెంచుకుని టిఆర్‌ఎస్‌ లో చేరిన చిలుకల గోవర్ధన్‌ ను మంత్రి కేటీఆర్‌అభినందించారు. ప్రజా ఆశీర్వాద సభలు విజయవంతం అయినందుకే సీనియర్‌ నేతలు ఈ విధంగా టిఆర్‌ఎస్‌ వైపు చూస్తున్నాన్నారు. బంగారు తెలంగాణా నిర్మాణంలో భాగస్వామ్యం అయేందుకు ముందుకు వచ్చిన గోవర్ధన్‌ సేవలను పార్టీ వినియోగించుకుంటుందని కేటీఆర్‌ పేర్కొన్నారు.