నల్లగొండ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా గౌని రాజారమేష్ యాదవ్..
మిర్యాలగూడ. జనం సాక్షి.
నల్లగొండ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా నాగార్జున సాగర్ నియోజకవర్గానికి చెందిన గౌని రాజారమేష్ యాదవ్ నియమితులయ్యారు. గౌని రాజారమేష్ కు నియామక పత్రాన్ని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి అందజేశారు. జాతీయ అధ్యక్షుడు బి.వి శ్రీనివాస్ ఆదేశాలతో , తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఇంచార్జీ సుర్బీ ద్వివేది , ఖలీద్ అహ్మాద్ ల అనుమతితో నియామకం జరిగినట్లుగా తెలిపారు. ఎన్.ఎస్.యూ.ఐ యూత్ కాంగ్రెస్ నాయకుడిగా రాజారమేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవను గుర్తించిన కాంగ్రెస్ హైకమాండ్ యూత్ కాంగ్రెస్ బలోపేతానికి మరోమారు జిల్లా అధ్యక్షుడి హోదాను కట్టబెట్టింది. సీనియర్ నేత కుందూరు జానారెడ్డి ప్రధాన అనుచరుడిగా రాజారమేష్ ముందుకు సాగుతున్నారు. హాలియా లో జూనియర్ కాలేజి ఎన్.ఎస్.యూ.ఐ అధ్యక్షుడిగా , అనుముల మండల అధ్యక్షుడిగా , జిల్లా కార్యదర్శిగా , యూత్ కాంగ్రెస్ నాగార్జున సాగర్ నియోజకవర్గ అధ్యక్షుడిగా , యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా సేవలు అందించారు. రాజరమేష్ సతీమణి హాలియా ఎం.పీ.టీ.సీ గా పనిచేశారు. హాలియా మున్సిఫల్ కౌన్సిలర్ ప్రస్తుతం కొనసాగుతున్నారు.టీ.పీ.సీ.సీ రాష్ట్ర నాయకులు కుందూరు బ్రదర్స్ రఘువీర్ రెడ్డి , జై వీర్ రెడ్డి లతో కలిసి జిల్లా వ్యాప్తంగా యూత్ కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు రాజారమేష్ ఎనలేని క్రుషి చేశారు. బలమైన క్యాఢర్ కల్గిన గౌనిరాజారమేష్ యాదవ్ నియామకానికి సహకరించిన టీ.పీ.సీ.సీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి , మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి ,ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బి.వి శ్రీనివాస్ , రాష్ట్ర అధ్యక్షులు శివసేనారెడ్డి , తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఇంచార్జీ లు సుర్బీ ద్వివేది , ఖలీద్ అహ్మాద్ , నల్లగొండ ఎం.పీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ,భువనగిరి ఎం.పీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , మాజీ మంత్రి దామోదర్ రెడ్డి , కుందూరు రఘువీర్ రెడ్డి , కుందూరు జై వీర్ లకు క్రుతజ్ఘతలు తెలిపారు రాజారమేష్..
మునుగోడు లో బరిగీసి కోట్లాడుతాం…
మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తధ్యమన్నారు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గౌని రాజారమేష్ యాదవ్. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి గడపుకు వెళ్లి కాంగ్రెస్ గెలిస్తేనే తెలంగాణలో విద్యార్దులకు , యువతకు ,నిరుద్యోగులకు , రైతులకు మంచి రోజులు వస్తాయని తెలియజేస్తామన్నారు. 2 వేల మంది యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి మునుగోడు నియోజకవర్గంలో కాంట్రాక్టుల కోసం కాంగ్రెస్ పార్టీని వీడిన రాజగోఫాల్ రెడ్డిని ఓడించి యూత్ కాంగ్రెస్ సత్తా చాటుతామన్నారు. గడపగడపకు యూత్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని చేపడ్తామన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ రుణం తీర్చుకోవడానికి మునుగోడు ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. మతోన్మాద బి.జె.పి అభ్యర్ది కాంట్రాక్టర్ రాజగోపాల్ రెడ్డిని ఓడించి కాంగ్రెస్ ను మోసం చేస్తే పుట్టగతులుండవని నిరూపిస్తామన్నారు.