హైదరాబాద్: రాష్ట్రావతరణ దినోత్సవాన్ని విద్రోహదినంగా పాటిస్తూ టీఆర్‌ఎస్ నిరసన తెలిపింది. పార్టీ సీనియార్‌నేత నాయిని నర్సింహారెడ్డి తెలంగాణభవన్‌లో నల్లజెండాను , పార్టీ జెండాను ఎగురవేశారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం జరిగిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే అన్ని సమస్యలకు పరిష్కారమని నాయిని చెప్పారు. కరీంనగర్‌లో 5,6 తేదిల్లో జరిగే పారర్టీ సమావేశం అనంతరం ఉద్యమ కార్యచరణ తీవ్రంగా ఉంటుందని నర్సింహరెడ్డి పేర్కొన్నారు.




