Wednesday, 4 November 2026

నల్లమలకు బయలుదేరిన స్పీకర్‌ బృందం

హైదరాబాద్‌: నల్లమల అటవీప్రాంతంలో చెంచుల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ నేతృత్వంలో వన్యప్రాణి, పర్యావరణ పరిరక్షణ కమిటీ మహబూబ్‌నగర్‌ జిల్లాకు బయలుదేరింది. జిల్లాలోని మన్ననూర్‌ ప్రాంతంలో నివసిస్తున్న చెంచుల అభివృద్ధి, తాగునీరు, గృహ నిర్మాణాలు, ఉపాధిహామీ, వైద్యం తదితర అంశాలపై  ఎమ్మెల్యేల బృందం దృష్టి సారించనుంది. రెండు రోజులపాటు ఈ పర్యటన సాగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *