నల్ల బెల్లం వ్యాపారి పై పిడి యాక్ట్ కేసు నమోదు

మహబూబాబాద్ బ్యూరో-ఆగస్టు 11(జనంసాక్షి)

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం లైన్ తండ కు చెందిన నల్ల బెల్లం వ్యాపారి పై పిడి యాక్ట్ కేసు నమోదు చేసి చర్లపల్లి జైలు కు పంపించినట్లు గూడూరు ఎక్సైజ్ సి ఐ బిక్షపతి తెలిపారు.ఈ సందర్భంగా సి ఐ మాట్లాడుతూ గూడూరు మండలం లైన్ తండ కు చెందిన అజ్మీరా సూర్య తండ్రి ఈర్యా అనే వ్యక్తి నల్ల బెల్లం అమ్ముతూ పట్టు పడడంతో పలు కేసులు నమోదు కావడంతో పిడి యాక్ట్ కేసు నమోదు చేసి జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశాల మేరకు చర్లపల్లి జైలు కు పంపించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ సి ఐ శ్రీ కృష్ణ,ఎక్సైజ్ స్టేషన్ గూడూరు సిబ్బంది,టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.