నవనీత్ వండగంతో అధిక దిగుబడి
పరిగి రూరల్, అక్టోబర్ 18 ( జనం సాక్షి) :
పత్తిలో నూజి వీడు నవనీత్ వంగడంతో రైతులు అధిక దిగుబడి పొందవచ్చని కంపెనీ ప్రతినిధులు ప్రతినిధి సతీష్, రాకేష్ పంత్ తెలిపారు. ఎలాంటి వర్షాభావ, ఇతర వాతావరణ పరిస్థితులను తట్టుకొని మొక్క ఎదుగుతూ కాయలు కాచి దిగుబడి ఇచ్చేందుకు ఈ రకం వండగాలు ఎంతగానో ఉపకరిస్తాయన్నారు. పరిగి మండలం
చిట్యాల, జాఫర్ పల్లి, సయ్యద్ పల్లి, రాఘవాపూర్,కాళ్లాపూర్ గ్రామాల్లో మంగళవారం కంపెనీ ప్రతినిధులతో కలిసి వ్యవసాయాధికారి ప్రభాకర్ రెడ్డి పంటలను పరిశీలించారు. ఈ సందర్బంగా నూజివీడు కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ నూజివీడు నవనీత్ పంట క్షేత్ర ప్రదర్శనకు విచ్చేసిన రైతులకు ముందుగా శుభాకాంక్షులు తెలిపారు. మండల వ్యాప్తంగా 132 ఎకరాల్లో ఈ రకం విత్తనాలతో వేసిన పంటలన్నీ చాలా బాగా ఉన్నాయన్నారు. అధిక వర్షాలకు కూడా తట్టుకున్నాయన్నారు. రైతుల మేలు కోరి ఈ రకం విత్తనాలను తయారు చేసి అధిక దిగుబడి వచ్చేందుకు కంపెనీ కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాఘవాపూర్ గ్రామ సర్పంచ్ నల్కజగన్, పీఏసీఎస్ డైరెక్టర్ హన్మంత్ రెడ్డి , కంపెనీ ప్రతినిదులు నాగరాజు, కిరణ్ రెడ్డి, సంజయ్ మాల్వియా ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ :
18 పిఆర్ జి 01 రాఘవాపూర్ గ్రామంలో పత్తి పంటలను పరిశీలిస్తున్న వ్యవసాయాధికారులు, రైతులు, కంపెనీ ప్రతినిధులు

Attachments area