ఆదిలాబాద్,జూన్25(జనం సాక్షి ): విత్తనాలు వేసి మొలకెత్తక పోవడంతో నష్టపోయినరైతులను ఆదుకోవాలని పలువురు రైతులు కోరారు. తొలకరితో పలుచోట్లు పత్తి తదితర విత్తనలు వేసినా, తదుపరి వర్షాలు పడకపోవడంతో అవి మురిగి పోయాయి. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. వర్షాభావంతో వేసిన పత్తి విత్తనాలు ఇంకా మొలకెత్తలేదని పలువురు కలెక్టర్ దివ్యదేవరాజన్‌కు చెప్పి ఆదుకోవాలన్నారు. అయితే అవి నాణ్యమైనవో కావో అన్నది తెలుసుకునేందుకు కలెక్టర్ పత్తి సంచులను పరిశీలించారు. రైతులు రైతు బంధును ఉపయోగించుకొని నాణ్యమైన విత్తనాలే కొనుగోలు చేయాలని, రసీదులు తప్పకుండా దగ్గర ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు. అవసరమైతే మత్తడి ప్రాజెక్టు నిండిన తర్వాత పంటలకు నీరు అందిస్తామన్నారు. ప్రభుత్వం వడ్డాడి మత్తడి ప్రాజెక్టు కుడి కాలువ నిర్మాణం కోసం నిధులు కేటాయించిం దని,1200 ఎకరాల ఆయకట్టుకు మూడు నెలల్లోగా సాగునీరందించాలని కలెక్టర్ దివ్య దేవరాజన్ నీటి పారుదలశాఖ ఈఈ, కాంట్రాక్టర్లను ఆదేశించారు. వడ్డాడి మత్తడి ప్రాజెక్టును కలెక్టర్ సందర్శించారు. రాష్ట్రంలో తొలిసారిగా ఇక్కడ కుడి కాలువను పైప్‌డ్ ఇరిగేషన్ ప్రాజెక్టు విధానంలో నిర్మిస్తున్నారన్నారు. కు ప్రభుత్వం ఈ కాలువలను పగడ్బందీగా నిర్మిస్తున్నదని వివరించారు. ఈ కాలువ పూర్తయితే వడ్డాడి, పొన్నా రి, హస్నాపూర్ రైతులకు మేలు జరుగుతుందన్నారు.ప్రకృతి రమణీయత ఉన్న ఇక్క డ పార్కు నిర్మాణం చేపట్టాలని విరివిగా హరితహారం మొక్కలు నాటి సంరక్షించాలని ఈఈని ఆదేశించారు. గడువులోగా నిర్మాణాలు పూర్తిచేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఎడ మ కాలువతో ఇప్పుడు అందుతున్న సాగునీటి వివరాలు ఈఈ చెప్పారు.




